Advertisementt

రవితేజ ఎందుకింత ఆలస్యం

Wed 11th Feb 2026 06:07 PM
ravi teja  రవితేజ ఎందుకింత ఆలస్యం
Bhartha Mahasayulaku Wignyapthi రవితేజ ఎందుకింత ఆలస్యం
Advertisement
Ads by CJ

సంక్రాంతి సీజన్ కి థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే  రాజాసాబ్, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు ఓటీటీలోకి గత వారమే వచ్చేసాయి. ఈ వారం మొదట్లోనే మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒకరాజు చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేసాయి.

అదే సంక్రాంతికి విడుదలైన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మేకర్స్ మాత్రం ఇప్పటికి ఓటీటీ అడ్రెస్స్ చెప్పకుండా మేకర్స్ సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. రాజసాబ్ హాట్ స్టార్ లో ఉంది, నారీ నారీ నడుమ మురారి అమెజాన్ ప్రైమ్ లో ఉంది, మన శంకర వరప్రసాద్ గారు జీ 5 నుంచి నేడు స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

ఇదే రోజు పోలిశెట్టి అనగనగ ఒకరాజు నెట్ ఫ్లిక్స్ నుంచి అందుబాటులోకి వచ్చింది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాన్ని జీ 5 డిజిటల్ హక్కులను దక్కించుకుంది, మరి థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న భర్త మహాశయులకు ఓటీటీ ని ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో అని రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

Bhartha Mahasayulaku Wignyapthi:

Bhartha Mahasayulaku Wignyapthi OTT Partner revealed

Tags:   RAVI TEJA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ