రంగుల ప్రపంచంలో కొన్ని ఊహించని విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక హీరోని కథానాయకుడి పాత్ర కోసం ఎంపిక చేసుకున్న నిర్మాత ఆ తర్వాత వేరొక హీరోతో అదే పాత్ర కోసం మంతనాలు సాగించాడు. దీని అర్థం ఏమిటి? మొదట మాట్లాడిన హీరోకి అవకాశం ఉన్నట్టా లేనట్టా? ఒకరితో మాట్లాడుతూనే ఇంకొకరితో రహస్య మంతనాలు సాగించడమేమిటి? ఇది అన్యాయం కాదా? ఆ హీరోని తక్కువ చూపు చూడటం కాదంటారా?
సరిగ్గా ఇదే కారణంతో ప్రముఖ హీరో రణ్‌వీర్ సింగ్ `డాన్ 3` ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని వెల్లడించారు. ఓవైపు తనతో మంతనాలు సాగిస్తూనే, హృతిక్ రోషన్ తో నిర్మాత ఫర్హాన్ అక్తర్ చర్చలు జరపడం తనను బాధించిందని తెలిపాడు. అంతేకాదు.. తనకు వందశాతం స్క్రిప్టు నచ్చలేదు. నిజానికి ఫర్హాన్ బౌండ్ స్క్రిప్టుపై అంతగా దృష్టి సారించలేదని కూడా రణ్ వీర్ సింగ్ ఆరోపించాడు. అంతేకాదు.. తనకు దురంధర్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది కాబట్టి తిరిగి తనతో మాట్లాడేందుకు ఫర్హాన్ వచ్చి కలిసాడు! అని కూడా రణ్ వీర్ తెలిపాడు. తనను చిన్న చూపు చూసాడని అతడు చెప్పకనే చెప్పాడు.
మొత్తానికి నిర్మాత ఫర్హాన్ తో రణ్ వీర్ సమస్య ఏమిటన్నది ఇప్పుడు బహిర్గతం అయింది. అయితే ఫర్హాన్ వీటి గురించి మాట్లాడకుండా, రణ్ వీర్ ని నమ్ముకుని ప్రీప్రొడక్షన్ కోసం కోట్లలో ఖర్చు చేసామని, అతడు 40 కోట్లు పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నాడు. ప్రస్తుతం ఈ సమస్యను నిర్మాతల గిల్డ్ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. సమస్యకు పరిష్కారం లభించాలని అందరూ కోరుకుంటున్నారు. డాన్ 3లో రణ్ వీర్ నటించాలా? లేక హృతిక్ అయితేనే కరెక్టా? మీరేమంటారు?





అంబటి కి బెయిల్.. రిలీజ్ ఎప్పుడంటే.. 
Loading..