Advertisementt

బాలయ్య-మలినేని దసరా సాధ్యమేనా

Wed 11th Feb 2026 07:50 PM
nbk111  బాలయ్య-మలినేని దసరా సాధ్యమేనా
NBK111 movie update బాలయ్య-మలినేని దసరా సాధ్యమేనా
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ2 తాండవం తర్వాత బిగ్ బ్రేక్ తీసుకుని గోపీచంద్ మలినేని తో NBK 111 ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. గత ఏడాది నవంబర్ లోనే మొదలు కావాల్సిన ఈప్రాజెక్టు మార్చ్ లో మొదలు కాబోతుంది. ముందు అనుకున్న కథా నేపథ్యం వేరు, ఇప్పుడు అనుకున్న కథా నేపథ్యం వేరు. 

మొదట్లో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ అనుకున్నది కాస్తా.. ఇప్పుడు యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా మారిపోయింది. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని మార్చి లో మొదలు పెడుతున్న ఈ ప్రాజెక్ట్ ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసి దసరా రిలీజ్ అనుకుంటున్నారనే టాక్ చూసి అది ఎలా సాధ్యమవుతుంది అంటూ అభిమానులు షాకవుతున్నారు.

మార్చ్ లో మొదలు పెడితే ఆరు నెలల్లో సినిమా ఫినిష్ చేయడమనేది ఈమధ్య కాలంలో చూసింది లేదు. ఇక బాలయ్య తదుపరి మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ లో హరీష్ శంకర దర్శకత్వంలో ఉండబోతుంది అనే టాక్ ఉంది. గోపీచంద్ మలినేని సినిమా తో పాటుగా హరీష్ మూవీ సిమిలర్ గా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.

NBK111 movie update:

Balakrishna-Gopichand Malineni NBK111

Tags:   NBK111
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ