Advertisementt

బ‌డ్జెట్ మ్యాట‌ర్‌ - నిర్మాత‌తో హీరో వివాదం

Mon 09th Feb 2026 05:39 PM
hrithik roshan  బ‌డ్జెట్ మ్యాట‌ర్‌ - నిర్మాత‌తో హీరో వివాదం
Krrish 4 faces delays బ‌డ్జెట్ మ్యాట‌ర్‌ - నిర్మాత‌తో హీరో వివాదం
Advertisement
Ads by CJ

విజువ‌ల్ గ్రాఫిక్స్ బేస్డ్ సినిమాలు తీయాలంటే వంద‌ల కోట్ల బ‌డ్జెట్లు అవ‌స‌రం. అలాంటి క‌థ‌ల‌ను రాసేందుకు చాలా మంది ర‌చ‌యిత‌లే ఉన్నా కానీ, ప‌రిమితుల‌ను చాలా ఆలోచించి వ‌దిలేస్తుంటారు. బ‌డ్జెట్ పెట్టేవాడు లేన‌ప్పుడు క్రియేటివిటీ ఎంత ప్ర‌ద‌ర్శించినా అది నిష్ప్ర‌యోజ‌నం.

ఇటీవ‌ల గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్న క్రిష్ 4 అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుండ‌టంపై అభిమానుల్లో చాలా చ‌ర్చ సాగుతోంది. అయితే ఈ సినిమా డిలే అవ్వ‌డానికి  బ‌డ్జెట్ ఒక పెద్ద కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు కం హీరో హృతిక్ ఈ సినిమా కోసం 500 కోట్లు పెట్టాల‌ని నిర్మాత ఆదిత్యా చోప్రాను అడిగార‌ట‌. అయితే దానికి చోప్రా స‌సేమిరా అన్నార‌ని, ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్లలో పూర్తి చేయాల‌ని హృతిక్ కి సూచించాడ‌ట‌. 

దీంతో హృతిక్ తొలుత అనుకున్న యాక్ష‌న్ సీక్వెన్సుల‌లో గ్రాండియారిటీని త‌గ్గించేస్తున్నార‌ట‌. ఆ మేరకు స్క్రిప్టులో మార్పు చేర్పులు చేస్తున్నార‌ని కూడా తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌ట్లో మొద‌ల‌య్యేట్టు క‌నిపించ‌డం లేదు. జూన్ త‌ర్వాత దీనిపై క్లారిటీ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు హృతిక్ వేరొక సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు రెడీ అవుతున్నార‌ని తెలిసింది.

Krrish 4 faces delays:

Krrish 4 faces delays as Hrithik Roshan and  Yash Raj Films disagree on the budget

Tags:   HRITHIK ROSHAN
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ