బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా అపూర్వా లాఖియా దర్శకత్వంలో `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పెండింగ్ షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్ వాయిదా పడేలా ఉంది.
రిలీజ్ కూడా అంత ఈజీ కాదని తెలుస్తోంది. కేవలం సెన్సార్ బోర్ట్ ఒక్కటే క్లియరెన్స్ ఇస్తే సరిపోదు. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇస్తే తప్ప రిలీజ్ సాధ్యం కాదు. దేశ భద్రతకు సంబంధించి కాన్సెప్ట్ కావడంతోనే ఈ పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది. భారత్-చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న గాల్వానా లోయ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే.
ఈ ఘర్ణణలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కర్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 20 మంది అమరులయ్యారు. చైనా సైనికులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే చైనా కసుబుస్సులాడుతోంది. సినిమా తీయడంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఘటన చైనా విజయంగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ముంబై సెన్సార్ బోర్డ్ ఒక్కటే క్లియరెన్స్ ఇస్తే సరిపోదు. కేంద్ర రక్షణ శాఖ కూడా చూసి న తర్వాతే ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ ఓసీ జారీ చేస్తేనే రిలీజ్ అవుతుంది. ఇదంత ఈజీ ప్రోసస్ కాదు. సెన్సార్ అంత ఈజీగా రక్షణ శాఖ అనుమతి ఇవ్వదు. ఈ నేపథ్యంలో చిత్రం వాయిదా పడుతుందని తెలుస్తోంది.





బడ్జెట్ మ్యాటర్ - నిర్మాతతో హీరో వివాదం
Loading..