Advertisementt

దసరా ఫైట్ - పెద్ది vs ఫౌజీ

Fri 30th Jan 2026 09:24 AM
peddi  దసరా ఫైట్ - పెద్ది vs ఫౌజీ
Dasara fight - Peddi vs Fauzi దసరా ఫైట్ - పెద్ది vs ఫౌజీ
Advertisement
Ads by CJ

ఎప్పుడో ఆరు నెలల తర్వాత రాబోతున్న దసరా ఫెస్టివల్ అప్పుడే బాక్సాఫీసు హీట్ ని పెంచేస్తుంది. క్రేజీ పాన్ ఇండియా స్టార్స్ ఇప్పటి నుంచే దసరా ఫెస్టివల్ పై కన్నెయ్యడం కాదు.. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబోలో ఆగష్టు 15 కి రావాల్సిన ఫౌజీ చిత్రాన్ని దసరా కి మార్చేశారు. దసరా అన్నారు కానీ డేట్ పై స్పష్టత ఇవ్వలేదు.

ఇప్పుడు అదే దసరా ఫెస్టివల్ కి  స్టార్ రామ్ చరణ్ పెద్ది కూడా కచ్చిఫ్ వెయ్యబోతున్నట్టుగా టాక్ నడుస్తుంది. మార్చ్ 27 న పెద్ది రిలీజ్ అని పదే పదే మేకర్స్ చెబుతున్నా ఇంకా షూటింగ్ అవ్వని కారణంగా పెద్ది ని మార్చి 27 ఉంచి పోస్ట్ పోన్ చెయ్యబోతున్నారనేది నిజం అంటున్నారు. మార్చి 27 నుంచి జూన్ కి పెద్ది వెళుతుంది అన్నప్పటికీ.. ఆ సమయంలో మెగాస్టార్ విశ్వంభర వస్తుంది.

అందుకే రామ్ చరణ్ పెద్దిని దర్శకుడు బుచ్చి బాబు దసరా ఫెస్టివల్ కి దించే ఆలోచన చేస్తున్నారట. ఈ ఏడాది దసరా కి పెద్ది vs ఫౌజీ అన్న రేంజ్ లో ఫైట్ ఖాయమైనట్లే కనిపిస్తుంది. మరి ఈ దసరా రేస్ లోకి ఇంకెంతమంది హీరోలు ఫైనల్ గా బాక్సాఫీసు బరిలోకి వస్తారో చూడాలి. 

Dasara fight - Peddi vs Fauzi:

Peddi vs Fauzi

Tags:   PEDDI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ