Advertisementt

చిరు-బాబీ మెగా 158 హీరోయిన్ ఫిక్స్

Fri 30th Jan 2026 10:21 AM
chiranjeevi  చిరు-బాబీ మెగా 158 హీరోయిన్ ఫిక్స్
Chiru-Bobby Mega 158 heroine fix చిరు-బాబీ మెగా 158 హీరోయిన్ ఫిక్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ క్రేజ్ లో తడిచిముద్దవుతున్నారు. రీసెంట్ గా మీడియా మిత్రులను కలిసి వారితో సరదాగా సంభాషిస్తూ తన సక్సెస్ ను పంచుకున్నారు. మన శంకర వరప్రసాద్ గారు 360 కోట్ల గ్రాస్ వసూలు చేసి మెగాస్టార్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలుస్తుంది.

ఈ సక్సెస్ ఊపులోనే విశ్వంభర ను జూన్ లేదా జులై విడుదల చేస్తున్నట్టుగా చెప్పిన చిరు అతి త్వరలోనే తన తదుపరి మూవీ బాబీ దర్శకత్వంలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బాబీ తో గతంలో వాల్తేర్ వీరయ్య చేసిన చిరు ఇప్పుడు మెగా 158 కి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది.

మెగా 158 లో చిరు సరసన ప్రియమణి నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. మెగా 158 యాక్షన్ కమ్ కమర్షియల్ చిత్రంగా ఉండబోతుంది అని, చిరంజీవి ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని, ప్రియమణి చిరు వైఫ్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్ వినబడుతుంది. 

Chiru-Bobby Mega 158 heroine fix:

Chiranjeevi - Bobby combo movie mega 158 heroine fix details inside

Tags:   CHIRANJEEVI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ