Advertisementt

విద్యార్థుల‌పై సినిమాల ప్ర‌భావం అలా

Fri 30th Jan 2026 09:18 AM
movies  విద్యార్థుల‌పై సినిమాల ప్ర‌భావం అలా
Movies విద్యార్థుల‌పై సినిమాల ప్ర‌భావం అలా
Advertisement
Ads by CJ

సినిమా తార‌ల ప్ర‌భావం పిల్ల‌ల మ‌న‌సుల‌పై అంతా ఇంతా కాదు. త‌మ అభిమాన హీరోని అనుక‌రించాల‌ని ప్ర‌య‌త్నించే కిడ్స్ ఉంటారు. త‌మ ఫేవ‌రెట్ హీరో ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు? ఎలాంటి షూ ధ‌రించాడు?  లేదా హెయిర్ స్టైల్ ఎలా ఉంది?  క‌ళ్ల‌ద్దాలు ఎలాంటివి ధ‌రించాడు?  ఉప‌యోగించే వాచ్.. కార్.. లేదా హెయిర్ క‌ల‌ర్ వంటి వాటిని ఇమ్మిటేట్ చేసేందుకు నేటి యూత్ వెన‌కాడ‌దు.

అయితే కర్నాట‌క‌లోని ఒక విలేజీలో ఇలాంటి ఒక ఘ‌ట‌న నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒక గ్రామంలోని పాఠ‌శాల హెడ్ మాస్టార్ ఏకంగా ఆ ఊళ్లోని సెలూన్‌ల‌కు ``హెబ్బులి హెయిర్ క‌ట్ చేయొద్దు`` అనే అభ్య‌ర్థ‌న పెంపారు. ఆ హెయిర్ క‌ట్ వ‌ల్ల విద్యార్థులు త‌మ అందం గురించి అద్దంలో చెక్ చేసుకోవ‌డానికే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు.. అని అత‌డు హెచ్చ‌రించాడు.. హెబ్బులి అనేది సినిమా టైటిల్. ఇందులో ఈగ‌ సుదీప్ హెయిర్ స్టైల్ ని ఇమ్మిటేట్ చేస్తూ ప‌రిస‌రాల్లోని పాఠ‌శాలల్లో మ‌గ పిల్ల‌లు చాలా ర‌చ్చ చేసేవారు. 

దీంతో అమ్మాయిల‌తో పోలిస్తే 60 శాతం మ‌గ‌పిల్ల‌ల‌కు స‌రైన మార్కులు రావ‌డం లేద‌ని గ‌మ‌నించార‌ట‌. హెడ్ మాస్టార్ నేరుగా సెలూన్ య‌జామానుల వ‌ద్ద‌కు వెళ్లి ఇదే విష‌య‌మై హెచ్చరించార‌ట‌. ఆ త‌ర్వాత‌ సెలూన్ బ‌య‌ట ``ఇచ్చ‌ట `హెబ్బులి` హెయిర్ క‌ట్ చేయ‌బ‌డ‌దు!`` అని బోర్డ్ పెట్టేసారు. ఆ త‌ర్వాత ఆ ప్ర‌ధానోపాధ్యాయుడిపై ప్ర‌శంస‌లు కురిసాయి. స‌మాజంపై సినిమాల ప్ర‌భావం ఎలా ఉంటుందో చెప్పుకునేందుకు ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌.  

Movies:

Students 

Tags:   MOVIES
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ