మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లి తర్వాత 11 ఏళ్ళ తర్వాత అంటే 2023 లో క్లింకార పాప జన్మించింది. జూన్ లో క్లింకార జన్మించగా ఇప్పటివరకు ఆ పాప ఫేస్ రివీల్ చెయ్యకుండా రామ్ చరణ్ ఇంకా మెగా ఫ్యామిలీ జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యింది.
ఈ విషయాన్ని గత ఏడాది దీపావళి కి మెగా ఫ్యామిలీ రివీల్ చేస్తూ ఉపాసనకు ఘనంగా శ్రీమంతం నిర్వహించారు. అయితే ఉపాసన ఈసారి కవలలకు జన్మనివ్వబోతోంది. ఖచ్చితంగా మెగాస్టార్ చిరు కి ఈసారి వారసులుగా మనవళ్ళు రాబోతున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది.
తాజాగా మెగా ట్విన్స్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది అని, జనవరి 31 న ఉపాసన కవలలకు జన్మనివ్వబోతోంది అని తెలుస్తుంది. రామ్ చరణ్ ఇంకా మెగా ఫ్యామిలీ మొత్తం ఉపాసన కి తోడుగా హాస్పిటల్ కి రాబోతున్నారు అని, గతంలోలానే అపోలో లో ఉపాసన కవలలకు జన్మనిస్తుంది అంటున్నారు. సో ఈ గుడ్ న్యూస్ తెలియడానికి మరో రెండు రోజులు వెయిట్ చేస్తే సరి.




శోభిత దూళిపాళ్ల హాట్ లుక్ 

Loading..