Advertisementt

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం

Wed 28th Jan 2026 01:20 PM
hreem  షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం
Hreem shooting wrapped షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం
Advertisement
Ads by CJ

తెలుగు భీజాక్షరాల్లో హ్రీం అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. హ్రీం అనే ఒక్క  భీజాక్షరంలో హ, ర, ఈ, మ అనే అక్షరాలున్నాయి. హ అంటే ధర్మం, ర అంటే అర్థం, ఈ అంటే కామం, మ అంటే మోక్షం..హ్రీం అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కించారు.  శివమ్‌మీడియా పతాకంపై  హ్రీం అనే భీజాక్షరంతో తయారైన ఈ  సినిమాలో నూతన నటీనటులు పవన్‌ తాత, డాక్టర్‌ చమిందా వర్మ జంటగా నటించారు. 

హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. హ్రీం  చిత్రానికి రాజేష్‌ రావూరి దర్శకుడు. శ్రీమతి సుజాత మల్లాల సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివమల్లాల నిర్మాత. వరంగల్‌ దగ్గరలోని పెద్ద పెండ్యాల గ్రామంలో తొలి షెడ్యూల్, హైదరాబాద్‌ హెచ్‌యంటీ కాలనీలోని ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో సెకండ్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది చిత్రం.

 ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కీలక పాత్రల్లో ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్‌ కనకాల, బెనర్జీ, భద్రం, అనింగి రాజశేఖర్‌ (శుబోదయం సుబ్బారావు), త్రిపురనేని శ్రీవాణి, పూజారెడ్డి, వనితా రెడ్డి తదితరులు నటించారు. కథ–కథనం–దర్శకత్వం – రావూరి రాజేష్‌

నిర్మాత– శివ మల్లాల

Hreem shooting wrapped:

Hreem shooting update

Tags:   HREEM
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ