రజనీకాంత్-కమల్ హాసన్ ద్వయం ఓ మల్టీస్టారర్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ అనుకున్నా? అతడు నేరేట్ చేసిన యాక్షన్ స్టోరీ ఇద్దరికీ నచ్చలేదు. ఇద్దరు లైట్ హార్టెడ్ స్టోరీలోనే నటించాలను కుంటున్నారు. భారీ యాక్షన్ స్టోరీలు గానీ..ప్రయోగాలు గానీ చేయడానికి ఎంత మాత్రం ఆసక్తిగా లేరు. ఓ మంచి హిలేరియస్ ఎంటర్ టైనర్ లో నటించడానికి కూడా సిద్దంగానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
అలాగైతే? వాళ్లిద్దరికి హిట్ మెషిన్ అనీల్ రావిపూడి పర్పెక్ట్ ఛాయిస్ గా చెప్పొచ్చు. వాళ్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎంటర్ టైనింగ్ స్రిప్ట్ ను ఇప్పుడున్న దర్శకుల్లో అనీల్ మాత్రమే రాయగలడు. ఇద్దరు బిగ్ స్టార్స్ ని డీల్ చేసే సామర్ధ్యం ఉన్న దర్శకుడు అనీల్. ఇప్పటికే చిరంజీవి-వెంకటేష్ లాంటి స్టార్లను డీల్ చేసిన అనుభవం ఉంది. పైగా అనీల్ మంచి ఫాంలో ఉన్నాడు.
ఇంత వరకూ వైఫల్యం అన్నదే ఎదురవ్వలేదు. ఒకే వేవ్ లో వేళ్తోన్న సమయంలో? `భగవంత్ కేసరి` లాంటి డిఫరెంట్ అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కమల్ -రజనీకాంత్ లాంటి స్టార్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ మంచి స్టోరీ రాయగలడు. కొంత కాలంగా తమిళ్ లో ఎంటర్ టైనింగ్ డైరెక్టర్లు కూడా తగ్గారు.
చాలా మంది సీరియస్ యాక్షన్ స్టోరీలవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి స్టార్స్ తో కామిక్ చిత్రాలు చేయడం లేదు. రజనీ-కమల్ ఎంటర్ టైనింగ్ స్టోరీ చేయాలనుకుంటే? అనీల్ ఒక్కడే ఆప్షన్ గా ఉన్నాడు. దళపతి విజయ్ తో `జన నాయగన్` డైరెక్షన్ ఛాన్స్ వచ్చినా? అనీల్ వదులుకున్న సంగతి తెలిసిందే.




షూటింగ్ పూర్తి చేసుకున్న హ్రీం

Loading..