మిల్కి బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తూ మీడియాకి దొరికిపోయింది. ఆతర్వాత పబ్లిక్ గానే కనిపించిన ఈ జంట గత ఏడాది పెళ్లి చేసుకోబోతుంది అనే ప్రచారం జరుగుతుండగానే సడన్ గా బ్రేకప్ చెప్పుకుంది. ఎందుకు విడిపోయారో అటు విజయ్ వర్మ కానీ, ఇటు తమన్నా కానీ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో తను ప్రేమలో మోసపోయిన విషయంపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలు విజయ్ వర్మను ఉద్దేశించే తమన్నా అనింది అనుకుంటున్నారు.
ఇంతకీ తమన్నా ఏం చెప్పింది అంటే తన లైఫ్ లో తను రెండుసార్లు తీవ్రంగా మధనపడిన సందర్భాలు ఉన్నాయని, మొదటిది నేను టీనేజ్‌లో ఉన్నప్పుడే ఫస్ట్ టైమ్ లవ్ లో పడ్డాను. కానీ కెరీర్ ముందు ఆ బంధం నిలవలేదు. నా ఫ్యూచర్ కోసం ఆ రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ బ్రేకప్ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను.
ఆ బంధం దగ్గరా చేదు అనుభవం ఎదురై అది నిలవలేదు, రిలేషన్ స్టార్ట్ చేసాక అతడు నాకు సరైన వ్యక్తి కాదని అర్థమైంది. అలాంటి బంధాన్ని కొనసాగించడం డేంజర్ అని అర్ధమై ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చాను అంటూ తమన్నా చేసిన వ్యాఖ్యలు విజయ్ వర్మ తో ఉన్న రిలేషన్ పైన చేసిందే అంటున్నారు.




సిర్తె తమిళ మూవీ రివ్యూ 

Loading..