Advertisementt

సిర్తె తమిళ మూవీ రివ్యూ

Tue 27th Jan 2026 07:38 PM
sirai  సిర్తె తమిళ మూవీ రివ్యూ
Sirai Tamil Movie Review సిర్తె తమిళ మూవీ రివ్యూ
Advertisement
Ads by CJ

తమిళనాట విక్రమ్ ప్రభు మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సిర్తె అక్కడ థియేటర్స్ లో మంచి హిట్ అయ్యింది. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈచిత్రం తాజాగా ఓటీటీలో పలు లాంగ్వేజెస్ లో అందుబాటులోకి వచ్చింది. జీ 5 ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చిన సిర్తె ని వీక్షించిన ఆడియన్స్ ఆహా ఓహో మంచి క్రైమ్ థ్రిల్లర్, ప్యూర్ లవ్ స్టోరీ ఈ సిర్తె అంటూ మాట్లాడుకోవడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్రెస్ట్  చూపిస్తున్నారు. మరి అంతగా ఈ చిత్రంలో ఏం ఉందొ అనేది సమీక్షలో చూసేద్దాం.

సిర్తె స్టోరీ: శ్రీనివాస్ (విక్రమ్ ప్రభు) ఓ కానిస్టేబుల్. ఎస్కార్ట్ లో భాగంగా తప్పించుకోబోయిన ఖైదీ ని షూట్ చెయ్యడంతో అతనిపై మరో ఇద్దరు కానిస్టేబుల్స్ పై విచారణ నడుస్తుంది. అదే సమయంలో ఓ కానిస్టేబుల్ ఎస్కార్ట్ డ్యూటీ ని శ్రీనివాస్ తీసుకుంటాడు. తనతో మరో ఇద్దరు కానిస్టేబుల్స్ ని తీసుకుని ఆ ఖైదీ అబ్దుల్ ని గుంటూరు కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్తాడు. ఆ ఖైదీ తప్పించుకోవాలని చాలాసార్లు ట్రై చేసి విరమించుకుంటాడు. ఆతర్వాత అతని కథ విని శ్రీనివాస్ కి జాలి కలుగుతుంది. ఈక్రమంలో అబ్దుల్ వలన శ్రీనివాస్ ఇంకా ఆ కానిస్టేబుల్స్ ఎలాంటి సమయాల్లో ఇరుక్కున్నారు, అబ్దుల్ ప్రేమ కథ సుఖంతమవుతుందా అనేది సిర్తె అసలు కథ.

విశ్లేషణ: 

సిర్తె గొప్ప లవ్ స్టోరీ ఏమి కాదు. సాదా సీదా ప్రేమ కథే. అందులోనే ఈ సస్పెన్సు ను, క్రైమ్ ని దర్శకుడు మిళితం చేసాడు. కానిస్టేబుల్, విచారణ, ఎస్కార్ట్, ఖైదీ ప్రేమ కథ ఇదే సిర్తె లో ఉండే అసలుకథ. కానీ ఆ కథను నడిపించిన తీరు కు ప్రేక్షకుడు అవలీలగా కనెక్ట్ అవుతాడు. మొదట్లో ఇదేం కథారా.. సోషల్ మీడియాలో అంతన్నారు, ఇంతన్నారు, తీరా చూస్తే సిర్తె లో ఏముందిరా రొటీన్ కథేగా, దీనికి ఇంత హైప్ ఎందుకు అనుకుంటారు. కానీ చివరి 30 నిముషాలు సిర్తె కి ఎందుకింత ఇంప్రెస్స్ అయ్యారో అనేది అర్ధమవుతుంది. అబ్దుల్ ఖైదీగా శ్రీనివాస్ కి తన కథ చెప్పి కళావతిని ఎంతగా ప్రేమించాడో చెప్పటం, ఆ కళావతి కూడా అబ్దుల్ ని ఎంతగా ఆరాధిస్తుందో చూస్తే అబ్బ ఎంత ప్యూర్ లవ్ స్టోరీ అనుకుంటారు. అబ్దుల్-కళావతి కలిసాక ఎలాంటి ట్విస్ట్ లు వస్తాయో, అబ్దుల్ జైలు నుంచి బయటికి రావాలని కోరుకొని ప్రేక్షకుడు ఉండడు. 

ఒక పల్లెటూరికి వలస వచ్చిన కుటుంబం అబ్దుల్ ది. తండ్రి హఠాన్మరణంతో చిన్న షాప్ పెట్టుకుని తల్లితో కలిసి జీవించే అబ్దుల్ చిన్నప్పటినుంచి కళావతిని ఇష్టపడతాడు. ఇద్దరి కులాలు వేరు.. కళావతి బావ తాగొచ్చి రచ్చ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అబ్దుల్ కళావతి తండ్రిని చంపి జైలుకెళ్తాడు. అతన్ని విడిపించడానికి ఎవరూ ఉండరు, కానీ కళావతి అబ్దుల్ విడుదల కోసం ప్రయత్నం చేసి ఓడిపోతుంది. ఆ సమయంలోనే కానిస్టేబుల్ శ్రీనివాస్ అబ్దుల్ కి సహాయం చేస్తాడు. చివరి నిమిషంలో అబ్దుల్- కళావతి కలవరేమో అన్న రీతిలో క్లైమాక్స్ ని నడిపించిన తీరుకి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టేస్తారు. కానీ చివరి సీన్ చూసాక ప్రేక్షకుడు ఫుల్ గా సాటిస్పై అవుతాడు.

పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గా విక్రమ్ ప్రభు, ఖైదీ అబ్దుల్ గా  అక్షయ్ కుమార్, అబ్దుల్ ప్రియురాలిగా అనిష్మా ఈ ముగ్గురి చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ ముగ్గురు నటించలేదు జీవించేసారు. 

దర్శకుడు పల్లెటూరి ప్రేమ కథను, కులాల మద్యన ఉన్న తేడాను సున్నితంగా టచ్ చేసిన విధానం, కానిస్టేబుల్ కి ఉన్న జాలి గుణాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు కి ప్రేక్షకుడు చప్పట్లు కొట్టాల్సిందే. BGM, సినిమాటోగ్రఫీ అన్ని దేనికవే సిర్తె కి సాటి అనేలాంటి అవుట్ పుట్. తమిళ నేటివిటీకి అనుగుణంగా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని సిర్తె చిత్రాన్ని ప్రేక్షకుడు ఇష్టపడేలా చేసాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. అబ్దుల్-కళావతి కలవరు అన్న బాధ, ఈ విషయంలో శ్రీనివాస్ నిస్సహాస్థితికి ప్రేక్షకులు కళ్ళవెంట తెలియకుండానే నీరు కారుతుంది. అంత చక్కటి లవ్, క్రైమ్ కలిసిన సిర్తె ని అస్సలు మిస్ అవ్వకండి, ఇక ఆలస్యమెందుకు వెంటనే వీక్షించేయ్యండి.  

Sirai Tamil Movie Review:

Sirai Movie TeluguReview

Tags:   SIRAI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ