కోలీవుడ్ హీరో కార్తీ-కృతి శెట్టి కలయికలో తెరకెక్కిన వా వాతియార్ ఎప్పుడో డిసెంబర్ లో విడుదలవాల్సింది. కానీ సెన్సార్ ప్రోబ్లెంస్, ఆర్థిక సమస్యల తో వాయిదా పడి ఎలాంటి హడావిడి లేకుండా పొంగల్ బరిలోకి వచ్చి షాకిచ్చింది. డిసెంబర్ లో విడుదల అన్నప్పుడు కార్తీ, కృతి శెట్టి ఈ చిత్రాన్ని తెగ ప్రమోట్ చేశారు.
కానీ పొంగల్ కి ఎలాంటి హంగామా లేకుండా విడుదలైన ఈ వా వాథియర్ చిత్రం అలానే సైలెంట్ గానే వెళ్ళిపోయింది. అంటే థియేటర్స్ లో వా వాథియార్ కి డిజాస్టర్ టాక్ వచ్చింది. అసలు ఈ చిత్రం తమిళనాట మెప్పించకపోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యడం ఆపేసారు మేకర్స్.
థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు 15 రోజులు తిరగేసరికి ఓటీటీలకి వచ్చేస్తున్నట్టుగా ప్రకటించారు. జనవరి 28 అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచే అయిదు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వారు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అది చూసి వా వాతియార్, అన్నగారు ఇంత త్వరగా ఓటీటీ కి వచ్చేస్తున్నారా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు.




క్యూట్ క్యూట్ ఫోజులతో మీనాక్షి చౌదరి 

Loading..