బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం సీరియల్ నటి తనూజ చుట్టూనే తిరిగింది. ఆమె అందం, ఆమె మాట తీరు, ఆమె బిహేవియర్, ఇతరులతో ఆమె నడుచుకునే విధానము అన్ని బిగ్ బాస్ కి కావాల్సినంత కంటెంట్ ఇవ్వడమే కాదు సీరియల్ లో కన్నా ఎక్కువగా బిగ్ బాస్ లో తనూజ ను చాలామంది ఇష్టపడి అభిమానులుగా మారిన వారు ఉన్నారు. ఆమె ఏదో గొప్ప కంటెస్టెంట్, ఆమె టాస్క్ ల్లో ఫస్ట్ అని కాదు, కానీ ఆమె బిహేవియర్, ఆమె అందానికి ఫిదా అయ్యి ఫ్యాన్స్ గా మారారు.
అందుకే తనూజ ను విన్నర్ అయ్యేవరకు సపోర్ట్ చేశారు. కానీ తనూజ నే కళ్యాణ్ పడాల ను నెత్తికెక్కించుకుని విన్నర్ కావాల్సిన అమ్మాయి రన్నర్ గా మిగిలిపోయింది. అయినప్పటికీ కొన్ని లక్షలమంది ప్రేమ, అభిమానాన్ని తనూజ పొందింది. మరి బిగ్ బాస్ నుంచి వచ్చాక విన్నర్ కళ్యాణ్ పడాల దగ్గర నుంచి టాప్ 5 వరకు, మిగతా కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో తెగ హడవిడి చేస్తున్నారు.
కానీ రన్నర్ గా మిగిలిన తనూజ చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంది. ఒకే ఒక్కసారి ఇన్స్టా లైవ్ లోకి వచ్చింది, సంక్రాంతి సెలెబ్రేషన్స్ కోసం స్టార్ మాకి వచ్చింది. ఆ ఈవెంట్ మొత్తం తనూజ కేవలం 10 నిముషాలు కూడా కనిపించలేదు. అంతేకాదు కనీసం సోషల్ మీడియాలోనూ ఒక్క ట్వీట్ వెయ్యట్లేదు.
అందుకే ఆమె పై అభిమానులు అలుగుతున్నారు, ఫైర్ అవుతున్నారు. తనూజ తమను పట్టించుకోవడం లేదంటూ అభిమానులు, నెటిజన్లు తనూజాపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాలంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. ఫోటో షూట్ కానీ, లేదంటే ఆమె ప్రెజెంట్ ఏమి చేస్తుందో అప్ డేట్ కానీ ఇవ్వమని అభిమానులు తనూజ ను అడుగుతూన్నారు.
వస్తావ్ ఇన్‌స్టాలో 4, 5 స్టోరీలు షేర్ చేస్తావ్, లేదా ఫెస్టివల్ కి ఒక స్టోరీ పెట్టేసి వెళ్లిపోతావ్.. బిగ్‌బాస్ షో అయిపోయింది.. ఫ్యాన్స్ కి ఒక అప్‌డేట్ ఇద్దాం.. కనీసం ఫోటోషూట్ అయినా చేద్దాం. కనీసం నీ రీల్స్ అయినా షేర్ చేశావా, లేదు. స్టోరీలు స్టోరీలు ట్రైన్ బోగీలాగా షేర్ చేస్తావ్ అంటూ ఆమె అభిమానులు చేసిన ఓ వీడియోను తనూజనే స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. మరి తనూజ అభిమానుల బాధను ఇప్పటికైనా అర్ధం చేసుకుంటుదో, లేదో చూడాలి.




కదులుతున్న దేవర 2

Loading..