యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో భారీ అంచనాలు నడుమ 2024 సెప్టెంబర్ లో విడుదలైన దేవర చిత్రానికి అనుకున్నంతగా హిట్ పడలేదు. ఎన్టీఆర్ అభిమానుల ఆదరణతో దేవర నిర్మాతలు గట్టెక్కారు కానీ.. లేదంటే దేవర వల్ల నిర్మాతలు నష్టపోవాల్సి వచ్చేది. దేవర పార్ట్ 1 కి ఇలా ఉంటే ఇకపై పార్ట్ 2 ఉంటుందా అనే అనుమానాలు ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి.
దేవర 1 రిజల్ట్ తర్వాత కొరటాల శివ దేవర 2 పై వర్క్ చేస్తున్నారు. సైలెంట్ గా దేవర 1 లో ఉన్న లోపాలు, విమర్శలకు అనుగుణంగా దేవర 2 స్క్రిప్ట్ ని మరింత పకడ్బందీగా తయారు చేస్తున్నా.. బయట మాత్రం దేవర కి సీక్వెల్ ఉండకపోవచ్చనే ఊహాగానాలు ఆగట్లేదు. కానీ ఈ ఊహాగానాలకు తాజగా నిర్మాత చెక్ పెట్టారు.
దేవర 2 ని ఈ ఏడాది మే 27 నుంచి పెట్టాలెక్కించబోతున్నట్లుగా చెప్పారు. అంతేకాదు 2027 లో దేవర రిలీజ్ ఉంటుంది అంటూ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ని షేర్ చేసారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దాని తర్వాత దేవర 2 స్టార్ట్ అవుతుంది, ఆతర్వాత మిగతా ప్రాజెక్ట్ ని సెట్ చేస్తారట. సో దేవర 2 పై ఇకపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ దిగులు పడక్కర్లేదు.




జన నాయగన్ వివాదం.. వదిలేలా లేదు 

Loading..