కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయకన్ కష్టాలకు అంతూ, పొంతు లేకుండా పోయింది. జన నాయకన్ రిలీజ్ వాయిదా వల్ల విజయ్ నష్టమేమి లేదు, కానీ అసలు కష్టాలు, నష్టాలూ అన్ని జన నాయకన్ నిర్మాతలకు. సెన్సార్ బోర్డు vs చెన్నై హై కోర్టు అన్నట్టుగా ఉంది జన నాయకన్ వ్యవహారం.
ఈరోజు జన నాయకన్ పై చెన్నై హై కోర్టు తీర్పు వస్తుంది, అనుకూలంగా తీర్పు వస్తే జన నాయకన్ ను ఫిబ్రవరి 6 న విడుదల చేసుకునే అవకాశం ఉంది, హమ్మయ్య జన నాయకన్ కష్టాలు తీరినట్టే అనుకుంటున్నారు. ఈ రోజు జన నాయగన్ చిత్రానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ని ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు సెన్సార్ బోర్డుకు తగిన సమయం ఇవ్వాలని పేర్కొంది.




చిరు వ్యాఖ్యలను విభేదిస్తున్న సింగర్ చిన్మయి 

Loading..