Advertisementt

ఉస్తాద్ డేట్ ఇవ్వడమే ఆలస్యం

Tue 27th Jan 2026 04:01 PM
ustaad bhagat  ఉస్తాద్ డేట్ ఇవ్వడమే ఆలస్యం
Ustaad Bhagat Dubbing Started ఉస్తాద్ డేట్ ఇవ్వడమే ఆలస్యం
Advertisement
Ads by CJ

ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర ల ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ లాక్ చేస్తారా. మార్చ్ లో అంటున్నారు, అదేదో అధికారికంగా ప్రకటిస్తే బావుంటుంది అని పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ వదిలారు.

తన శక్తివంతమైన రచన, మాస్‌ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా కల్ట్ కెప్టెన్ అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే ఉస్తాద్ భగత్ సింగ్ ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే సంభాషణలకు ఈ చిత్రం హామీ ఇస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇది అభిమానులలో, సినీ ప్రేమికులలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.

గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన దేఖ్‌ లేంగే సాలా గీతం శ్రోతలను ఉర్రూతలూగించింది.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం యొక్క నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్లను త్వరలోనే నిర్మాతలు వెల్లడించనున్నారు. 

Ustaad Bhagat Dubbing Started:

Ustaad Bhagat Singh Update

Tags:   USTAAD BHAGAT
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ