గత 50 రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీసును చెడుగుడు ఆడిన ధురంధర్ చిత్రం దూకుడు తగ్గింది. డిసెంబర్ 5 న విడుదలైన రణ్వీర్ సింగ్ ధురంధర్ చిత్రం స్లో గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫైనల్ రూ.1300 కోట్ల కలెక్షన్స్ తో ఇప్పటివరకు క్రేజీగా ఉన్న పలు సినిమాల రికార్డ్ లను చెరిపేసింది. 50 రోజుల తర్వాత కూడా ధురంధర్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు.
కానీ ఇప్పుడు ధురంధర్ దూకుడుకు మరో బాలీవుడ్ మూవీ అడ్డం పడింది. అదే బోర్డర్ 2. ఎలాంటి అంచనాలు లేకుండా మూడు గంటల ఇరవై నిమిషాల సుదీర్ఘ నిడివితో వచ్చిన ఈ వార్ డ్రామా మెల్లగా స్టార్ట్ అయ్యి మొదటి వీకెండ్ కే రణ్వీర్ దురంధర్, విక్కీ కౌశల్ చావా రికార్డులకు ఎసరు పెట్టేసింది. గత శుక్రవారం విడుదలైన బోర్డర్ 2 ఫస్ట్ వీకెండ్ లో రూ.130 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు సాధించినట్టుగా తెలుస్తుంది.
వరుణ్ ధావన్, సన్నీ డియోల్ కీలక పాత్రల్లో తెరకెక్కిన బోర్డర్ 2 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. మొదటి రోజు అంటే ఓపెనింగ్ డే నుంచే బోర్డర్ 2 కి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడం లాంగ్ వీకెండ్ కావడంతో బోర్డర్ 2 కలెక్షన్స్ దూసుకుపోతున్నాయి. మరి లాంగ్ రన్ లో బోర్డర్ 2 ఏ మూవీ రికార్డ్ బోర్డర్ ని దాటుతుందో అనేది కాస్త వేచి చూడాల్సిందే.
.




ఖైదీ 2 పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ 
Loading..