కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఖైదీ చిత్రంతోనే లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆతర్వాత లోకేష్ కి స్టార్ హీరోల అవకాశాలు వెల్లువెత్తాయి. ఖైదీ కి సీక్వెల్ ఉంటుంది అని చెప్పి ఏళ్ళు గడిచిపోతున్నాయి. కానీ లోకేష్ కనగరాజ్ వేరే హీరోలతో ముందుకు వెళుతున్నారు కానీ.. ఖైదీ2 పేరు ఎత్తడం లేదు. మరోపక్క హీరో కార్తీ ఖైదీ 2 ఉంటుంది అంటూ చెప్పడమే కానీ ఆ ప్రాజెక్ట్ లో కదలిక లేదు.
రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 పారితోషికం విషయంలో ఆ ప్రోజెక్టు ని పక్కనపెట్టేశారు, అల్లు అర్జున్ తర్వాత వేరే మూవీస్ చేస్తారు అనే న్యూస్ ఒకటి చక్కర్లు కొట్టింది. తాజాగా లోకేష్ కనగరాజ్ ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. భారీ పారితోషికం విషయంలో నేను ఖైదీ 2 నుంచి తప్పుకున్నానని, దానితో LCU కథ ముగిసిపోయిందని అంటూ చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే, ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. అల్లు అర్జున్ తో నేను చెయ్యబోయే ప్రాజెక్ట్ తర్వాత కార్తీ తో ఖైదీ 2 ఖచ్చితంగా ఉండబోతుంది. ఆ ప్రాజెక్ట్ ఆతర్వాత అంటే ఖైదీ 2 అలాగే విక్రమ్ 2, రోలెక్స్ ఇవే నా కమిట్మెంట్స్ అంటూ లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 పై స్పష్టతనిచ్చారు.
ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తిచేయకుండా నేను ఎక్కడికీ వెళ్లను. LCU కూడా చాలా త్వరలోనే తిరిగి ఓపెన్ అవుతుంది. బెంజ్ కూడా LCU లో భాగమే అంటూ లోకేష్ కనగరాజ్ తన లైనప్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.




అదృష్టాన్ని వెతుక్కుంటున్న పోరి 
Loading..