కొన్నాళ్లుగా వరస వైఫల్యాలతో సతమతమవుతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన అభిమానులు ఆశపడ్డారు. కానీ కింగ్ డమ్ కూడా నిరాశపరిచింది. కింగ్ డమ్ తర్వాత విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యారు. అందులో దిల్ రాజు బ్యానర్ లో ఒకటి, మరొకటి టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ తో సినిమాలు లైన్ పెట్టారు.
రవి కిరణ్ కోలా దర్శకత్వంలో కీర్తి సురేష్ తో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. రౌడీ జనార్ధన టైటిల్ తో వస్తున్నారు. రౌడీ జనార్ధన తో పాటుగా విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మరో మూవీ ని పట్టాలెక్కించారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాహుల్ సాంకృత్యాయన్-విజయ్ దేవరకొండ ల మూవీ టైటిల్ రివీల్ చేసారు.
ఈ చిత్రానికి రణబాలి అనే టైటిల్ ని ఫిక్స్ చేసి ఓ వీడియో తో అనౌన్స్ చేసారు. అంతేకాదు సెప్టెంబర్ 11 న రణబాలి విడుదల అంటూ అనౌన్స్ చేసారు. అయితే ఈ ఏడాది రవి కిరణ్ తో రౌడీ జనార్ధన, ఇటు రాహుల్ తో రణబాలి చిత్రాలతో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
మరి రెండు చిత్రాల టైటిల్స్ ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేసరికి విజయ్ దేవరకొండ ఈసారి ఆర్ నే నమ్ముకున్నాడుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.




ధురంధర్ దూకుడు కి కళ్లెం వేసిన బోర్డర్
Loading..