మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇంకా ఇంకా కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. జనవరి 12 న విడుదలైన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం స్టిల్ ఇప్పటికి హౌస్ ఫుల్ అవుతూనే ఉంది. ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు కూడా వరప్రసాద్ థియేటర్స్ కళకళలాడుతున్నాయి.
ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తుంటే మన శంకర వరప్రసాద్ గారు ఈజీగా రూ. 400 కోట్ల క్లబ్బులోకి చేరుకుంటుంది. ఇప్పటికే రూ.350 కోట్లు క్లబ్బులోకి వెళ్లిన వరప్రసాద్ గారు ఫైనల్ గా థియేట్రికల్ రన్ ముగిసేసరికి రూ. 400 కోట్లు కొట్టడం గ్యారెంటీ అంటూ మెగా ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.
అటు మెగాస్టార్ చిరు తనకు ఇంతటి హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి కి రేంజ్ రోవర్ గిఫ్ట్ ఇవ్వడమే కాదు, తనతో మరో సినిమా చేస్తాడో, లేదో అంటూనే హెలికాఫ్టర్ గిఫ్ట్ ఇస్తే చేస్తాడేమో అంటూ మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ఈవెంట్ లో చమత్కరించారు. సో మెగా ఫ్యామిలీ,మెగా ఫ్యాన్స్ అందరూ ఈ సక్సెస్ ని తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు.




మెగాస్టార్ సక్సెస్ సెంటిమెంట్ గా ఆ బ్యూటీ

Loading..