Advertisementt

ఆ బ్యూటీ మెగాస్టార్ స‌క్సెస్ సెంటిమెంట్

Mon 26th Jan 2026 02:54 PM
catherine tresa  ఆ బ్యూటీ మెగాస్టార్ స‌క్సెస్ సెంటిమెంట్
Megastar Chiranjeevi ఆ బ్యూటీ మెగాస్టార్ స‌క్సెస్ సెంటిమెంట్
Advertisement
Ads by CJ

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ప్రాధాన్య‌త ఎక్కువే. హిట్ కాంబినేషన్లు, లక్కీ హీరోయిన్ల పై నిరంత‌రం చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ విజయాల వెనుక నటి కేథరిన్ థ్రెసా హైలైట్ అవుతోంది. ఆ మూడు విజ‌యాల వెనుక క్యాథ‌రీన్ కీల‌కంగా మారిందంటున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే. చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత సాధించిన మూడు భారీ విజ‌యాలివే.

ఖైదీ నం. 150, వాల్తేరు వీరయ్య, మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూడు సినిమాల‌తోనూ క్యాథ‌రీన్ కు సంబంధం ఉంది. అదెలా అంటారా? వాల్తేరు వీరయ్య, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల్లో కేథరిన్ కీలక పాత్రలతో అల‌రించిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవికి హీరోయిన్ కాక‌పోయినా? న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో క‌నిపించి మెప్పించారు.

చిరంజీవి సినిమాలో చిన్న పాత్ర పోషించినా? ఆ గుర్తింపు వేరుగా ఉంటుంది. దీంతో ఏ హీరోయిన్ చిరు సినిమాలో ఛాన్స్ అంత ఈజీగా వ‌దుల‌కోదు. ఆ రంక‌గా క్యాథ‌రీన్ చిరు సినిమా అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుని ల‌క్కీ ఛార్మ్ గా మారింది. ఈ రెండు సినిమాల కంటే ముందే అమ్మ‌డు చిరంజీవి కంబ్యాక్ చిత్రం ఖైదీ నెండ‌ర్ 150 లోనూ ఓ కీల‌క పాత్ర‌కు అనుకున్నారు. ఆడిష‌న్ కూడా చేసారు.

కానీ ఎందుక‌నో చివ‌రి నిమిషంలో ఆమెను త‌ప్పించారు. ఆమె స్థానంలో ల‌క్ష్మీ రాయ్ ని తెచ్చారు. కానీ ఆ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 150 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించిన చిత్ర‌మిది. అప్పుడు ఛాన్స్ కోల్పోయినా? త‌ర్వాత న‌టించిన చిరు రెండు చిత్రాల్లోనూ బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులందుకుంది. ఈ మూడు సినిమాల విజ‌యాల్లో క్యాథ‌రీన్ పేరు స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతోంది. 

Megastar Chiranjeevi:

Catherine Tresa in MSG

Tags:   CATHERINE TRESA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ