బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ఏడాది కాలంగా వెండితెరకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్లు అవకాశాల కోసం పాకులాడుతుంటారు. కానీ భూమి పడ్నేకర్ మాత్రం వచ్చిన ఆఫర్లను వదులుకోవడమే కాకుండా, తీసుకున్న అడ్వాన్స్‌లను సైతం వెనక్కి ఇచ్చేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. దీంతో భూమీ ఎందుకిలా చేస్తోంది? ఆమెకి ఏమైందంటూ సోషల్ మీడియాలో అభిమానలు అడిగే ప్రయత్నం చేసారు.
కానీ అమ్మడు మాత్రం పెదవి విప్పలేదు. తాజాగా ఆ కారణాలు బయటకు వచ్చాయి. భూమి సోషల్ మీడియాలో తనపై వస్తోన్న నెగిటివిటీ , ట్రోలింగ్ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయిందిట.‘ద రాయల్స్’ సిరీస్ తర్వాత తనపై జరిగిన వ్యక్తిగత దాడుల వల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోకూడదని భావించి, గతేడాది జూన్ నుండి సినిమాలకు విరామం ప్రకటించినట్లు తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో ఎటువంటి సినిమా చర్చల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుందిట. నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ లు కూడా ఆ కారణంగానే తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. నటీనటులకు మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని, మళ్ళీ కొత్త ఎనర్జీతో తిరిగి రావడానికి ఇటువంటి విరామాలు అవసరమని భూమి పడ్నేకర్ భావిస్తోందిట.
త్వరలోనే అమ్మడు నటించిన ‘దల్ దల్’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో భూమి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. కమిట్ అయిన సినిమాల్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ప్రణాళిక సిద్దం చేసుకుందిట. మార్చి నుంచి ఆ ప్రణాళిక అమలు లోకి తెస్తుందని తెలుస్తోంది.




తస్కరి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్
Loading..