Advertisementt

టైగ‌ర్‌తో మ‌ళ్లీ ప్రేమ‌లో దిశా ప‌టానీ

Sun 25th Jan 2026 10:10 AM
disha patani  టైగ‌ర్‌తో మ‌ళ్లీ ప్రేమ‌లో దిశా ప‌టానీ
Disha Patani - Tiger Shroff టైగ‌ర్‌తో మ‌ళ్లీ ప్రేమ‌లో దిశా ప‌టానీ
Advertisement
Ads by CJ

లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ ఇటీవ‌ల ప్ర‌భాస్ `క‌ల్కి 2898 ఏడి`లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. కంగువ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో సూర్య స‌ర‌స‌న‌ న‌టించింది. అయితే దిశాకు ఇటీవ‌ల స‌రైన విజ‌యాలు ద‌క్క‌లేదు. ఇంత‌లోనే దిశా ప‌టానీ వ్య‌క్తిగ‌త జీవితం గురించి ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. దిశా త‌న జిమ్ కోచ్ అలెక్స్ ఇలిక్ తో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చార‌మైంది. టైగ‌ర్ ష్రాఫ్ నుంచి విడిపోయాక‌, ఫిట్నెస్ కోచ్ అలెక్స్ ఇలిక్ తో ఎక్కువ స్నేహంగా క‌నిపించ‌డంతో ఈ పుకార్ సాగింది.

కానీ ఇప్పుడు టైగ‌ర్ ష్రాఫ్ తో ప్రేమ కోసం దిశా ప‌రిత‌పించిపోవ‌డం చ‌ర్చ‌గా మారింది. తాజాగా ఓ ఇన్ స్టా పోస్ట్ లో టైగ‌ర్ ని మెప్పించ‌డం కోసం తాను చాలా ప్ర‌య‌త్నిస్తాన‌ని వ్యాఖ్యానించింది. జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, ఫైర్ రింగ్‌ల నుండి ఫ్లిప్స్ చేయడం వంటివి కేవలం సినిమాల కోసమే కాదు.. టైగర్‌ను ఇంప్రెస్ చేయడానికి చేసేవేన‌ని దిశా తెలిపింది. 

టైగ‌ర్ నెమ్మ‌దిగా ఉంటాడు.. అత‌డు త‌నలో ఏం ఉందో బ‌య‌ట‌పెట్ట‌డు! అని కూడా దిశా పేర్కొంది. ప్ర‌భాస్ `క‌ల్కి 2898 ఏడి` చిత్రంలో న‌టించింది. త‌దుప‌రి సీక్వెల్ లో న‌టించాల్సి ఉంది. వెల్ కం టు ద జంగిల్ స‌హా ప‌లు చిత్రాలు దిశా క్యూలో ఉన్నాయి.

Disha Patani - Tiger Shroff:

Disha Patani Attends Christmas Celebration at Tiger Shroff Home

Tags:   DISHA PATANI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ