భారత కోచ్ గ్రెగ్ చాపెల్ తో వాగ్వాదం.. లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి ఎమోషన్ కి గురైన సందర్భం.. సినీనటి నగ్మాతో ప్రేమాయణం వరకూ ప్రతిదీ సౌరవ్ గంగూలీ జీవితంలో ప్రత్యేకమైన ఎపిసోడ్స్. ఇప్పుడు వాటన్నిటినీ వెండితెరపై వీక్షించే అవకాశం కలుగుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్ గా దూకుడైన ఆట తీరుతో అలరించిన సౌరవ్ గంగూలీ బయోపిక్ ని లవ్ రంజన్ తెరకెక్కిస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో అగ్ర కథానాయిక నగ్మాతో రొమాన్స్ ని మరో లెవల్ లో ఆవిష్కరిస్తారని, దీనిని కమర్షియలైజ్ చేసే క్రమంలో నగ్మాతో గంగూలీ పరిచయం, అతడి ఆటను చూసేందుకు నగ్మా ఎలా గ్యాలరీలలో కూచుని సందడి చేసేదో కూడా చూపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో నాయకానాయికల రొమాన్స్ ఎంతో అందంగా హృదయాలను హత్తుకునేలా చూపిస్తున్నారట.
అయితే గంగూలీ పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నది చాలా కాలం పాటు సందిగ్ధంలో ఉంది. రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్ల నటిస్తారని ప్రచారమైనా, చివరికి రాజ్ కుమార్ రావును ఎంపిక చేసుకున్నారు. అతడు ప్రస్తతం లెఫ్ట్ హ్యాండ్ వాటం బ్యాటింగ్ ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే మాట్లాడే ఇంగ్లీష్ కూడా బెంగాలీ యాసతో ఎలా ఉంటుందో ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఈ ఏడాది మార్చిలో చిత్రీకరణ ప్రారంభించి 2027లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
దాదా బయోపిక్ ని మెలోడ్రామాతో రక్తి కట్టించే ఎమోషన్స్ తో తెరకెక్కించేందుకు లవ్ రంజన్ గట్టి కృషి చేస్తున్నాడని సమాచారం.




టైగర్‌తో మళ్లీ ప్రేమలో దిశా పటానీ

Loading..