మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిన్నపాటి గ్యాప్ తోనే వాల్తేర్ వీరయ్యతో తనకు హిట్ ఇచ్చిన బాబీ కొల్లి తో తన తదుపరి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. త్వరలోనే మెగా 158 సెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు మెగాస్టార్, రేపు ఆదివారం మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.
తాజాగా మెగా 158 ప్రాజెక్ట్ టైటిల్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగా 158 కి బాబీ పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నారట. మెగా 158 కి కాక గా టైటిల్ పెడితే మెగాస్టార్ కి సరిపోతుంది. ఎలాగూ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఈ మూవీ ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్లుగా టాక్ వినబడుతుంది.
ఇక ఈప్రాజెక్టు లో చిరు కి జోడిగా ప్రియమణి నటిస్తుంది అని, ఆయన కుమార్తె పాత్రలో కృతి శెట్టి ని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా.. కృతి శెట్టి పేరు ఫైనల్ అవ్వలేదు అని మెగా 158 టీం క్లారిటీ ఇచ్చింది.




మోక్షు బాబు కి మోక్షం ఎప్పుడో 
Loading..