పాపం నందమూరి ఫ్యాన్స్. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ సీరియల్ లా సాగుతూనే ఉంది. ఇదిగో మోక్షు ఎంట్రీ, అదిగో మోక్షు ఎంట్రీ అనడమే కానీ మోక్షజ్ఞ కి మాత్రం మోక్షం దొరకడం లేదు, మోక్షు ఎంట్రీ విషయంలో నందమూరి అభిమానులకు ప్రతిసారి డిజప్పాయింట్మెంట్ కలుగుతూనే ఉంది.
ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని స్వయానా బాలయ్యే చెప్పారు. అసలు ఆదిత్య 999 ఎప్పుడు మొదలవుతుంది అనేది పెద్ద ప్రశ్న. అఖండ తాండవం విడుదలైంది.. బాలయ్య గోపీచంద్ మలినేని తో నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోతున్నారు. అందుకే నందమూరి అభిమానులు టెన్షన్ పడేది.
ఆ ఆదిత్య 999 మొదలు పెడితే మెల్లగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాడు, ఆ తర్వాత సోలో గా సినిమాలు చేసుకుంటాడు, ప్రశాంత్ వర్మ ను నమ్ముకుంటే అతను హ్యాండ్ ఇచ్చాడు, మోక్షజ్ఞ చురుకుగా ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన చెయ్యడు అదే నందమూరి అభిమానుల బాధ. మరి మోక్షు బాబు కి ఆ మోక్షం ఎప్పుడు కలుగుతుందో చూడాలి.




84 కోట్ల కేసును కూల్‌గా డీల్ చేసిన డైరెక్టర్
Loading..