Advertisementt

84 కోట్ల కేసును కూల్‌గా డీల్ చేసిన డైరెక్ట‌ర్

Sat 24th Jan 2026 04:16 PM
anand  84 కోట్ల కేసును కూల్‌గా డీల్ చేసిన డైరెక్ట‌ర్
Director 84 కోట్ల కేసును కూల్‌గా డీల్ చేసిన డైరెక్ట‌ర్
Advertisement
Ads by CJ

డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ తన సూపర్ హిట్ చిత్రం `రాంజానా` ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP లేదా మేధోసంప‌త్తి) హక్కుల విషయంలో ఎదుర్కొంటున్న 84 కోట్ల దావాపై చాలా కూల్‌గా స్పందించారు. ఈ వివాదంపై ఆయ‌న రియాక్ష‌న్ వెబ్ లో చ‌ర్చ‌గా మారింది. అసలు వివాదం ఏమిటి? అనేదాని వివ‌రాల్లోకి వెళితే.. రాంజానా సినిమా మేకింగ్, దాని ఐపీ హక్కులకు సంబంధించి ఒక వ్యక్తి లేదా సంస్థ (నిర్మాణ భాగస్వామి) ఆనంద్ ఎల్. రాయ్‌పైనా, ఆయన ప్రొడక్షన్ హౌస్ `కలర్ ఎల్లో ప్రొడక్షన్స్`పైనా కోర్టులో కేసు వేశారు. హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ దాదాపు రూ.84 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ భారీ దావాపై ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆయన చాలా సింపుల్‌గా కొట్టిపారేశారు. ``ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు. కేవలం ఆరోపణలు చేసినంత మాత్రాన లేదా కేసు వేసినంత మాత్రాన అది నిజం అయిపోదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మా వైపు న్యాయం ఉంది కాబట్టి మేం ఆందోళన చెందడం లేదు`` అని అన్నారు.

ఆయన మాటల సారాంశం ప్రకారం.. ఈ కేసు కేవలం తనను ఇబ్బంది పెట్టడానికి లేదా డబ్బు సంపాదించడానికి వేసినది మాత్రమే అని, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని ఆయన నమ్ముతున్నారు.

ధనుష్ - ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్‌లో `తేరే ఇష్క్ మే` ఇటీవ‌లే విడుద‌లై విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.  ఇది రాంజానా ప్ర‌పంచానికి సంబంధించిన సినిమా అని కొంద‌రు విశ్లేషించారు. ఆ త‌రవాత  ఐపీ వివాదం చెల‌రేగింది. ఇప్పుడు కోర్టుల ప‌రిధిలో పోరాటం సాగుతోంది. కానీ ఆనంద్ ఎల్. రాయ్ స్పందన చూస్తుంటే ఆయన తన తదుపరి సినిమాలపై పూర్తి ఫోకస్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఐపీ వివాదంలో త‌న‌కు పోయేది ఏమీ ఉండ‌ద‌న్న ధీమా ఆయ‌న‌లో క‌నిపిస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమాకు సీక్వెల్ లేదా అదే తరహా సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి కాపీరైట్ లేదా ఐపీ వివాదాలు రావడం సర్వసాధారణం. రాంజానా చిత్రం ధనుష్‌కు బాలీవుడ్‌లో అద్భుత‌మైన‌ ఇమేజ్ ను ఇచ్చింది కాబట్టి దీనిపై ఏ చిన్న వార్త అయినా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ప్ర‌స్తుతం ఐపీ వివాదం కోర్టుల ప‌రిధిలో ఉన్నందున ఇంకా దీనిపై స్పంద‌న‌లు అన‌వ‌స‌రం. కోర్టు ప్ర‌తిదీ నిర్ణ‌యిస్తుంది.

Director:

84 cr case

Tags:   ANAND
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ