యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న పీరియడిక్ యాక్షన్ థ్రిల్లర్ `స్వయంభు` రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యంగా కారణంగా వాయిదా పడుతోంది. రకరకాల తేదీలు ప్రకటించి వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా
ఫిబ్రవరి 13న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని వేసవి బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ విజువల్ వండర్‌ను వెండితెరపై ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వాయిదాకు అసలు కారణం ఇదేనా? ఈ వాయిదా వెనుక ఒక బలమైన కారణం వినిపిస్తోంది. `స్వయంభు` లో విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకం. ప్రేక్షకులకు గతంలో ఎన్నడూ చూడని ఒక గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, రాజీ పడకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ విఎఫ్ ఎక్స్ సంస్థలతో మేకర్స్ చేతులు కలిపారు. ప్రతి ఫ్రేమ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దేందుకే అదనపు సమయాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడం వల్ల వేసవి సెలవుల అడ్వాంటేజ్ గా లభిస్తుంది. కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు ఇలాంటి ఫాంటసీ - చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలను చూడటానికి ఇష్టపడతారు కాబట్టి, ఇది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడానికి సహాయపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇందులో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్`’ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ పనిచేస్తున్నారు. అలాగే రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే కొత్త విడుదల తేదీపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.




సక్సెస్ జోష్‌లో శంబాల 2

Loading..