టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ `శంబాల` అనే థ్రిల్లర్ సినిమాతో కంబ్యాక్ అయ్యాడు. ఇటీవలే విడుదలైన సినిమా బాక్సాఫీస్ వద్ద అందుకున్న సాలిడ్ హిట్ అందుకుంది. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే జోరును కొనసాగిస్తోంది. తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ లో రెండు రోజుల క్రితమే రిలీజ్ అయింది. స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
థియేటర్లలో మిస్టరీ థ్రిల్లర్‌గా అలరించిన సినిమా ఓటీటీలోనూ వ్యూయర్‌షిప్ రికార్డులను తిరగరాస్తోంది. హారర్ - భక్తి అంశాలను మేళవించిన తీరు ఓటీటీ ఆడియన్స్‌ను కట్టి పడేస్తోంది. ఆది సాయికుమార్ నటన, డైరెక్టర్ ఉగంధర్ ముని టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ఫ్రాంచైజీలో రెండో భాగం `శంభల 2` రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మొదటి భాగంలో చూపించిన ఆధ్యాత్మిక రహస్యాలు, హారర్ ఎలిమెంట్స్‌ను సీక్వెల్‌లో మరింత భారీ స్థాయిలో చూపించబోతున్నట్లు తెలిపారు. సెకండ్ పార్ట్ కోసం బడ్జెట్ సాంకేతిక విలువలను కూడా పెంచుతున్నట్లు నిర్మాతలు తెలిపారు. మొదటి భాగం టీమ్ తోనే ముందుకెళ్తున్నారు. అవసరం మేర అదనంగా కొత్త పాత్రలు యాడ్ అవుతాయని తెలుస్తోంది.
ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. బీజీఎమ్ సినిమాకు ఆత్మలా నిలిచింది. హారర్ సీన్లలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించాయి. ప్రవీణ్ బంగారి సినిమాటోగ్రఫీ 1980ల నాటి వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.




క్యూట్ కృతి శెట్టి కి అదృష్టం ఎక్కడుందో 

Loading..