ప్రభాస్ బాహుబలి తర్వాత యాక్షన్ సీక్వెన్స్ ల్లోనూ, అలాగే చాలా సన్నివేశాల్లో యాక్ట్ చెయ్యడం లేదు, ఆయన బదులు డూప్ ని వాడుతున్నారు దర్శకులు, జస్ట్ ప్రభాస్ వచ్చి సెట్ లో ఉంటే చాలు.. ఆయన బాడీ డబుల్ తో పని కానిచ్చేస్తున్నారు అనే ప్రచారం మాములుగా జరగడం లేదు. కానీ స్పిరిట్ కోసం సందీప్ వంగ మాత్రం ఈ ఊహాగానాలను అస్సలు పట్టించుకోకుండా ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా వాడుతున్నారట.
స్పిరిట్ షూటింగ్ మొదలైన తర్వాత ఐదు రోజుల చిత్రీకరణలోనే ప్రభాస్ పాల్గొన్నారట. ప్రస్తుతం విదేశలలో ఉన్న ప్రభాస్ అక్కడి నుంచి రాగానే వచ్చే నెలలో డేహ్రాడూన్ లో 15 రోజుల పాటు స్పిరిట్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటుగా ప్రధాన తారాగణం షూట్ లో పాల్గుంటుందని తెలుస్తుంది.
అయితే స్పిరిట్ కి సంబంధించి కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకున్నప్పటికీ అందులో ఒకే ఒక సీన్ షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. ఒక్క సీన్ మాత్రమే చిత్రీకరించినప్పటికీ ఆ సీన్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఆ సీన్ లో ప్రభాస్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టడానికి సందీప్ రెడ్డి ప్రభాస్ ను రెండు గంటల పాటు ఎండలో నిలబెట్టినట్లుగా తెలుస్తుంది.
ఇలా రెండు గంటల పాటు కృషి చేస్తేనే సందీప్ రెడ్డికి కావాల్సిన పర్ఫెక్ట్ షాట్ వచ్చిందని, ప్రభాస్ కూడా స్పిరిట్ కోసం వెయిట్ లాస్ అయ్యి ఫుల్ గా మేకోవర్ అయ్యారని ఆయన లేటెస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది. ఇక ప్రభాస్ ఎండలో ఉన్న షాట్ గురించి తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.




బుల్లితెర రంగానికి జాతీయ అవార్డులు

Loading..