బుల్లితెర నేడు అత్యున్నత స్థానానికి ఎదిగింది. ఓవైపు ఓటీటీలు వెల్లువలా దూసుకొస్తున్నా, బుల్లితెర తన అస్థిత్వాన్ని కాపాడుకోవడంలో, మనుగడను సాగించడంలో ఎక్కడా తడబడటం లేదు. పోటీ బరిలో ఎన్ని ఉన్నా, ఏది పుట్టుకొస్తున్నా, టీవీలు సాలిడ్ గా నిలబడ్డాయి. ఈ రంగం ఎప్పటికీ పాతపడిపోవడం లేదు. ఎప్పటికప్పుడు జెన్ జెడ్ క్రియేటర్లు బుల్లితెర రంగాన్ని నిత్యనూతనంగా మార్చేందుకు తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. ఇటీవల టీవీ సీరియళ్లలో చాలా మెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సహా పలు రియాలిటీ షోలు బుల్లితెర రంగాన్ని నిలబెడుతున్నాయనడంలో ఎలాంటి సందేహాలు లేవు.
అయితే ఈ రంగంలో మరింత ప్రొడక్టివిటీ పెరగడం కోసం, నటీనటులలో ఉత్సాహం పెంచడానికి జాతీయ అవార్డులను అందజేయాలని కోరారు సీనియర్ నటుడు రవికిషన్. పెద్దతెరకు జాతీయ అవార్డులు ఎలా అందజేస్తున్నారో, అలాగే బుల్లితెరకు కూడా అందజేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రంగం చాలా మందికి ఉపాధినిస్తోందని, కోట్లాది మంది ఆదరిస్తున్నారని అన్నారు. కష్టపడేవారికి సరైన గౌరవం దక్కడం లేదని కూడా రవికిషన్ అన్నారు.
ప్రస్తుతం రవికిషన్ సూచనకు బుల్లితెర వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీవీ తెరపై ఎక్కువగా సాస్ -బాహు (అత్తా- కోడలు) సీరియళ్లు ఎక్కువయ్యాయి. నాణ్యమైన కంటెంట్ లేకుండా ఈ అవార్డులు దేనికి? అనే విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. అయితే నాణ్యమైన, క్రియేటివిటీతో కూడుకున్న విభిన్నమైన కంటెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ప్రత్యేకించి జాతీయ అవార్డులు ఏర్పాటు చేస్తే బావుంటుందేమో! `అల్లు అర్జున్` రేసు గుర్రం చిత్రంలో రవికిషన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు భాషలలో ఆర్టిస్టుగా ఆయన బిజీగా ఉన్నారు.




ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసుకున్న NBK111

Loading..