కోలీవుడ్ స్టార్ కార్తీ సరైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే విడుదలై `వావాతయార్` డిజాస్టర్ గా నమోదైంది. ఎన్నో ఆర్దిక ఇబ్బందుల మధ్య రిలీజ్ అయిన సినిమా హిట్ తో అప్పుల ఊబి నుంచి బయట పడాలనే ప్రయత్నం నిర్మాత చేసినా ఫలించలేదు. ఫలితాలు తారుమారయ్యాయి. దీంతో కార్తీ కూడా తదుపరి సినిమాపై ఆశలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కార్తీ ఆశలన్నీ స్పై థ్రిల్లర్ `సర్దార్ 2`పైనే.
`సర్దార్` తెలుగు, తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అతి త్వరలోనే రిలీజ్ ప్రకటన రానుంది. వాస్తవానికి ఈ చిత్రం కూడా గత ఏడాదే రిలీజ్ అవ్వాలి. కానీ అనివార్య కారణాలు సహా షూటింగ్ డిలే కూడా జరిగింది.
నిర్మాణానంత పనుల్లో కూడా జాప్యం జరుగుతోంది. రిలీజ్ పరంగా `సర్దార్ 2` కి ఎలాంటి ఇబ్బందులు లేనట్లే తెలు స్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ వ్యవహారాలు ఇంకా బయటకు రాలేదు. అలాగే తెలుగు లో ఏ నిర్మాత రైట్స్ తీసుకున్నారు? అన్నది క్లారిటీ లేదు. కార్తీ మాత్రం ఈ సినిమా నుంచి రిలీవ్ అయిపోయాడు.
ప్రస్తుతం కార్తీ `మార్షల్` అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాని తమిళ అనే కొత్త దర్శకుడు పని చేస్తున్నాడు. అలాగే కార్తీ మరికొన్ని కొత్త కథలకు కూడా సైన్ చేసాడని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.




స్పిరిట్ పర్ఫెక్షన్ - ఎండలో ప్రభాస్ 

Loading..