రామ్ చరణ్-బుచ్చిబాబు కలయికలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పెద్ది మూవీ షూటింగ్ అప్ డేట్స్ కన్నా పెద్ది మార్చ్ 27 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనే వార్తలే ఎక్కువగా వినిపించాయి. మేకర్స్ ఎంతగా మార్చ్ 27 నే పెద్ది సినిమా రిలీజ్ అంటున్నా ఈ ఊహాగానాలు ఏదో ఒక విధంగా వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే తాజాగా ధురంధర్ పార్ట్ 2 మార్చ్ 19 న రాబోతుంది, అందుకే మార్చ్ 27 నుంచి పెద్ది విడుదల వాయిదా ఉండొచ్చనే రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పెద్ది నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి హైలెట్ అయ్యింది. దర్శకుడు బుచ్చి బాబు సినిమా మొదటి భాగం ఎడిట్ లాక్ చేసి దాన్ని రీ రికార్డింగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రహమాన్ కి పంపించారట.
పెద్ది ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ తన అద్భుతమైన నటన తో అందర్నీ ఆశ్చర్యపరచబోతున్నారు అంటున్నారు. మరి రామ్ చరణ్ పెద్ది షాట్ ఎంతగా వైరల్ అయ్యింది, చికిరి చికిరి సాంగ్ కూడా అంతే సెన్సేషన్ అయ్యింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.




వరప్రసాద్ గారు వెంకీ కి ఎంతిచ్చారు 

Loading..