మన శంకర వరప్రసాద్ గారు లో క్యామియో చేసిన వెంకటేష్ కి ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ ఎంతిచ్చారు అనే విషయంలో వెంకీ ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఉన్నారు. ఎందుకంటే వెంకీ ఈ చిత్రం కోసం 9 కోట్లు పారితోషికం తీసుకున్నారనే ప్రచారం ఉంది. మన శంకర వరప్రసాద్ హిట్ లో వెంకీ భాగమయ్యారు. చిరు చరిష్మా, అనిల్ రావిపూడి మ్యాజిక్ వరప్రసాద్ హిట్ లో ఎంత క్రెడిట్ ఉందొ వెంకీ క్యామియోకి కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి.
చిరు-వెంకీ కలిసి చేసిన సాంగ్ ఆడియన్స్ ని అలరించింది. అయితే వెంకీ కి ఈ చిత్రానికి పారితోషికం ఎంతిచ్చారనే విషయంలో నిర్మాత సుష్మిత మాట్లాడుతూ.. వెంకటేష్ మా సినిమాలో నటించడం మాకు లక్కీ అయ్యింది, ఆయన పాత్ర సినిమాకి హెల్ప్ అయ్యింది. వెంకటేష్ గారికి రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదు.
ఆయన పాత్ర ఎంటరయిన దగ్గరనుంచి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, ఆయన తీసుకున్న పారితోషికానికి న్యాయం చేసారు, చిరు-వెంకీ సెట్ లో ఉంటే అక్కడంతా సరదాగా మారిపోయేది అంటూ వెంకీ పారితోషికం వివరాలను బయటపెట్టకుండా సుష్మిత కవర్ చేసింది.




MSG యూనిట్ కి PK క్రియేటివ్ వర్క్స్ శుభాకాంక్షలు

Loading..