గత ఏడాది మొదలైన రామ్ చరణ్ - బుచ్చిబాబు ల పాన్ ఇండియా మూవీ పెద్ది చిత్రం 2026 మార్చ్ 27 విడుదల అంటూ ముందే మేకర్స్ ప్రకటించేసారు. కానీ ఈమద్యలో పెద్ది రిలీజ్ పై పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో కనిపించడం, వాటిని మేకర్స్ ఎప్పటికప్పుడు కొట్టి పారెయ్యడమే కాదు మార్చి 27 సినిమా రిలీజ్ అంటూ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు.
కానీ ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది వాయిదా తప్పేలా లేదు అంటున్నారు. కారణం బాలీవుడ్ లో పెద్ది రిలీజ్ సమయానికి ధురంధర్ 2 థియేటర్స్ లో ఉంటుంది. ధురంధర్ బ్లాక్ బస్టర్ అయ్యి రూ.1300 కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు క్రేజీగా మారిపోయింది. ఇప్పుడు దాని సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. అంత క్రేజ్ ఉన్న ధురంధర్ 2 పైకి పెద్ది ని విడుదల చెయ్యడం కరెక్ట్ కాదు అనుకుంటున్నారట.
నార్త్ లో ధురంధర్ 2 వల్ల పెద్ది మార్కెట్ రిస్క్ లో పడుతుంది, అంతేకాదు ధురంధర్ 2 ని పాన్ ఇండియా భాషల్లో విడుదల చేసినా పెద్దికి ప్రోబ్లెం అవుతుంది. అందుకే పెద్ది ని మార్చి 27 నుంచి పోస్ట్ పోన్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మరి ఈ ఊహాగానాలకు పెద్ది మేకర్స్ ఎలా చెక్ పెడతారో చూడాలి.





ఈ ఊపులో బైకర్ ని దించేయ్ శర్వా 
Loading..