ఆరేడు ప్లాప్స్ తర్వాత యంగ్ హీరో శర్వానంద్ నారి నారి నడుమ మురారి చిత్రంలో మంచి హిట్ అందుకుని ట్రాక్ లోకి వచ్చాడు. సంక్రాంతి సీజన్ లో వచ్చి నలిగిపోతాడు అనుకుంటే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ వీక్ లోనే ప్రొడ్యూసర్స్ కి లాభాలు తెచ్చిపెట్టాడు.
మరి ఈ ఊపులోనే శర్వానంద్ బైకర్ ని వదిలితే బావుంటుంది అనేది శర్వా అభిమానుల కోరిక. గత ఏడాది డిసెంబర్ 6 న విడుదల కావాల్సిన బైకర్ వాయిదా పడింది. ఇప్పటివరకు సినిమా విడుదల విషయంలో మేకర్స్ సైలెంట్ గానే ఉన్నారు తప్ప బైకర్ ముచ్చట తియ్యడం లేదు. నారి నారి నడుమ మురారి హిట్ తర్వాత బైకర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తే బావుండేది.
అప్పుడు సినిమా పై క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటివరకు ప్లాప్స్ లో ఉన్న శర్వా పై ఒక్కసారిగా బయ్యర్లలో హోప్స్ మొదలైంది. ఇలాంటి సమయంలో బైకర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే బావుంటుంది. మరోపక్క శర్వానంద్ ప్లాప్ డైరెక్టర్ శ్రీను వైట్లకు అవకాశం ఎలా ఇచ్చాడు అనే ప్రశ్నకు..
శ్రీనువైట్ల ఫ్లాపుల్లో ఉన్నాడని ఆయనతో సినిమా ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు.. మరి నా సంగతి అంతే కదా, నాకు దాదాపు 6,7 ఫ్లాపులు పడ్డాయిగా.. అంటూ శర్వా ఆన్సర్ ఇచ్చాడు.





వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు-ఏపీ సీఎం హైలెట్ 
Loading..