సినిమా రిజల్ట్ గురించి ప్రభాస్ అస్సలు పట్టించుకోడు, ది రాజసాబ్ పై నెగిటివిటి ఆయనేమి లెక్కలోకి తీసుకోడు అంటూ ఆయనతో పని చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ అంటున్న మాట. రీసెంట్ గా ప్రభాస్ నటించిన రాజసాబ్ విడుదలై షెడ్డు కెళ్ళిపోయింది. ఆ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్ బాగా డిజప్పాయింట్ అయ్యింది.
రాజసాబ్ పై ట్రోల్స్, నెగెటివ్ కామెట్స్ ఎన్నో వచ్ఛాయి. కానీ ప్రభాస్ ఇవేమి పట్టించుకోడు తన పనేదో తానుచేసుకుంటాడు, పాలిటిక్స్ లో వేలు పెట్టడు, చాలా మంచోడు ప్రభాస్, ఫేక్ గా ఉండడం ఆయనకు చేతకాదు, నేను ఆయనలా ఉండగలనా అని చాలాసార్లు అనుకుంటాను.
ప్రభాస్ ది చిన్నపిల్లాడి మనస్తత్వం, ఎంతో నిష్కల్మషంగా ఉంటాడు, ప్రేమగా మాట్లాడతాడు. ప్రభాస్ ని ఎవరు కలిసినా వారితో ఎంతో సరదాగా ఉంటాడు, తానొక స్టార్ అన్న విషయమే గుర్తుండదు. చాలా సింపుల్ గా దేనిని సీరియస్ గా తీసుకోదు, కమర్షియల్ గా ఉండడం ఆయనకు చేతకాదు అంటూ నిధి అగర్వాల్ ప్రభాస్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.





రామ్ చరణ్ పెద్ది వాయిదా పడుతుందా 
Loading..