ఈ సంక్రాంతి కి రిలీజ్ అయ్యి యునానమస్ హిట్ గా నిలిచింది మన శంకర వరప్రసాద్ గారు. ఫస్ట్ వీక్ లోనే రూ.300 కోట్లు కలెక్ట్ చేసి చిరంజీవి కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా మారింది. విశేషమేమిటంటే వీకెండ్ కంప్లీట్ అయ్యాక వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ తో నిలబెట్టుకోవడం ఈ సినిమా తాలుకు స్ట్రెంత్ ని ప్రూవ్ చేస్తుంది.
ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న చిరంజీవి హైదరాబాద్ కి రాగానే.. ఈ సినిమా తాలూకు సక్సెస్ పార్టీ ని చాలా గ్రాండ్ గా నిర్వహించే ప్లాన్స్ జరుగుతున్నాయి. ఓ వైపు కలెక్షన్స్, మరోవైపు సోషల్ మీడియా ప్రశంశలతో తడిచి ముద్దవుతున్నారు చిరంజీవి. ఈరోజే అల్లు అర్జున్ కూడా ప్రత్యేకంగా ప్రశంసిస్తూ పెద్ద ట్వీట్ పెట్టడం గమనార్హం. ఈ సందర్భంగా చిరంజీవి ప్రత్యేకించి అల్లు అర్జున్ కి థాంక్స్ చెప్పకపోయినా.. అందరికి థాంక్స్ చెబుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.
ఆ ప్రెస్ నోట్ లో దశాబ్దాలుగా తనని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అండగా నిలబడిన అభిమానులకు మరీ మరీ కృతఙ్ఞతలు చెప్పిన చిరంజీవి రికార్డులనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.. మీరు చూపించే అభిమానమే శాశ్వతం అంటూ హార్ట్ ఫెల్ట్ థాంక్స్ చెప్పారు. అలాగే తనకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. ఇక్కడే జరిగింది ఒక చిన్న తప్పిదం అదేమిటంటే..
సంక్రాంతి సీజన్ లో ఈ సినిమా ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి చిరంజీవి ఛరిష్మా, అనిల్ రావిపూడి మ్యాజిక్ ఎంతవరకు కారణమైందో వెంకీ క్యామియో కూడా అంతే హెల్ప్ అయ్యింది అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోను, ఆఫ్టర్ రిలీజ్ ఇంటర్వ్యూ లోను వెంకీ ని తెగ పొగిడిన చిరంజీవి ఈ థాంక్స్ నోట్ లో మాత్రం కనీసం వెంకటేష్ పేరు ప్రస్తావించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వెంకీ అభిమానుల నుంచి అయితే విమర్శలను రప్పిస్తుంది. సక్సెస్ వరకు వెంకీ ని వాడుకుని హిట్టు రాగానే అది తనదే అనే స్వభావాన్ని చిరు చూపిస్తున్నారా, ఆ క్రెడిట్ అంతా తనకే దక్కాలని భావిస్తున్నారా అంటూ కొన్ని విమర్శలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. మరీ విషయం చిరు దృష్టికి ఎప్పుడు వెళుతుందో..





NTRNeel షూటింగ్ కి చిన్న బ్రేక్ 
Loading..