యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో మొదలయ్యింది. రెండు రోజుల క్రితం మొదలైన ఈ షెడ్యుల్ నైట్ షూట్ లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.
అయితే ఇప్పుడు #NTRNeel షూట్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. కారణం ఎన్టీఆర్ కోల్డ్ తో బాధపడుతూ ఉండడంతో..ఈ రోజు ప్రశాంత్ నీల్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రిపబ్లిక్ డే 2026 విడుదల అంటూ మేకర్స్ గత ఏడాది అఫీషియల్ గా ప్రకటించినా.. ఇప్పుడు ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది అనే వార్తలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సతమతమయ్యేలా చేస్తుంది.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీ రోల్ పోషిస్తుండగా, మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుంది. ఇలా ప్రతి భాష నుంచి నీల్ ఎన్టీఆర్ మూవీ కోసం నటులను ఎంపిక చేస్తూ పాన్ ఇండియా క్రేజ్ ని పెంచుతున్నారు.





MSG బ్లాక్బస్టర్ - మెగాస్టార్ ఎమోషనల్ 
Loading..