బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల ఆ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చుట్టూ బౌన్సర్లు తో తన క్రేజ్ చూపిస్తున్నాడు. ఆర్మీ మ్యాన్, కామన్ మ్యాన్ గా సీజన్ 9 ట్రోపీ గెలిచిన కళ్యాణ్ పడాల ప్రస్తుతము ఆర్మీ జాబ్ వదిలేసి సినిమాల్లో తనని తను పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాడు.
అయితే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ కప్ ని మాత్రమే సాధించింది అదేదో దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చినట్టుగా ఆయన అభిమానులు బిహేవ్ చేస్తున్నారు. కళ్యాణ్ పడాల కూడా గెలవగానే తన ఊరిలో సెలబ్రేషన్స్ మీట్ పెట్టి అక్కడి లోకల్ ఎమ్యెల్యేను ఆహ్వానించాడు. ఇప్పుడు తాజాగా విశాఖ ఎమ్యెల్యే గంటా శ్రీనివాస్ ను కలిసాడు.
ఆ విషయాన్ని గంటా శ్రీనివాస్ రావు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల నన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయనగరం జిల్లాకు చెందిన కల్యాణ్ బిగ్ బాస్ షో లో విజేతగా నిలిచిన మొట్టమొదటి కామనర్. షో లో తీవ్ర పోటీ ఎదుర్కొని విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించా.. అంటూ ట్వీట్ చేసారు.
గంటా శ్రీనివాస్ తో కళ్యాణ్ దిగిన ఫొటోస్ చూసిన వారు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల కు ఈ పొలిటికల్ మీటింగ్స్ అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.





వెంకీ విషయంలో చిరుతప్పిదం 
Loading..