చిన్న దర్శకుడు, అసలే డిజాస్టర్ లో ఉన్న దర్శకుడుని నమ్మి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవకాశమిస్తే.. పెద్ద సినిమాని హ్యాండిల్ చెయ్యలేక చేతులెత్తేసాడు దర్శకుడు మారుతి. నిజంగా ది రాజాసాబ్ సంక్రాంతి సీజన్ లో విడుదలైంది కాబట్టి.. మరీ డిజాస్టర్ అవ్వలేదు కానీ.. ఆ సినిమా ఏ డిసెంబర్లోనో విడుదలై ఉంటె ప్రభాస్ ఫ్యాన్స్ పరువు పోయేది
కానీ ప్రభాస్ స్టామినాతో ఎంతోకొంత కలెక్షన్స్ రాబట్టింది. అయితే రాజసాబ్ లాంటి పెద్ద సినిమాని మారుతి హ్యాండిల్ చెయ్యలేకపోయాడు, ప్రభాస్ ఛాన్స్ ఇస్తే ఇలానేనా చేసేది అని ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి పై ఫైర్ అవుతున్నారు. అయితే రాజసాబ్ ప్లాప్ తర్వాత దర్శకుడు మారుతి ని నమ్మి ఛాన్స్ ఇచ్చే హీరో ఉన్నారా..
అంటే మెగా కాంపౌండ్ లోని ఓ హీరోని తన స్నేహితుడు ద్వారా మారుతి కాకా పడుతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మారుతి తన స్నేహితుడి ద్వారా మెగా హీరోకి రాయబారం పంపి ఓకే అనిపించుకుని.. తన దగ్గర ఉన్న కథలపై కసరత్తులు చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది.
మరి మారుతిని నమ్మి తక్కువ బడ్జెట్ తో సినిమా చేసేందుకు ఓ నిర్మాతను కూడా పట్టాడట మారుతి. చూద్దాం ఆ మెగా హీరో ఎవరో, ఆ నిర్మాత ఎవరు అనేది.





శర్వానంద్ కూడా కొట్టాడు ప్రాఫిట్స్
Loading..