Advertisementt

శర్వానంద్ కూడా కొట్టాడు ప్రాఫిట్స్

Tue 20th Jan 2026 11:02 AM
nari nari naduma murari  శర్వానంద్ కూడా కొట్టాడు ప్రాఫిట్స్
Nari Nari Naduma Murari Into Profits శర్వానంద్ కూడా కొట్టాడు ప్రాఫిట్స్
Advertisement
Ads by CJ

సంక్రాంతి కి విడుదలైన సినిమాల్లో ఒక్కొక్కటి లాభాల బాట పడుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు ఎప్పుడో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి మరీ ప్రాఫిట్స్ తెచ్చుకొవడమే కాదు రూ.300 కోట్ల క్లబ్బులోకి అఫీషియల్ గా చేరి అద్దరగొట్టే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక ఆ వెంటనే నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు కూడా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి ఏకంగా రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి కి మొట్టమొదటి 100 కోట్ల మూవీగా అనగనగ ఒకరాజు నిలిచింది. ఇక ఈ కోవలోనే కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచిన నారి నారి నడుమ మురారి కలెక్షన్స్ విషయంలో కన్ఫ్యూజన్ నడుస్తుంది.

కారణం అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైన శర్వానంద్ మూవీకి హిట్ టాక్ వచ్చినా థియేటర్స్ తక్కువ ఉండడంతో తక్కువ కలెక్షన్స్ రావడం చూసి ఈ సినిమా నిర్మాత ఒడ్డున పడతాడా, లేదా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. తాజాగా నారి నారి నడుమ మురారి కూడా బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి వదిలారు.

బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యినట్లుగా, సంక్రాంతికి యునానమస్ బ్లాక్ బస్టర్ నారి నారి నడుమ మురారి అంటూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. 

Nari Nari Naduma Murari Into Profits :

Nari Nari Naduma Murari  Into Profits In All Areas

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ