క్యూట్ అండ్ గ్లామర్ శ్రీలీల కి తెలుగులోనే కాదు తమిళంలోనూ షాక్ లు తగిలాయి. తెలుగు లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీలీల కు తమిళ్ డెబ్యూ అయినా ఆమెకు సక్సెస్ ని ఇస్తుంది అనుకుంటే ఆమె నటించిన పరాశక్తి బాక్సాఫీసు ఫెయిల్యూర్ గా నిలిచింది. దానితో శ్రీలీల డిజప్పాయింట్ అయ్యింది.
అయితే శ్రీలీల ట్రాక్ రికార్డ్ తో పని లేకుండా బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల జత కట్టింది. బాలీవుడ్ డెబ్యూ ఇంకా రిలీజ్ అవ్వకుండానే శ్రీలీల కు అక్కడ ఆఫర్స్ తన్నుకొస్తున్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందుతున్న నాగ్జిల్లా లో శ్రీలీల ని అదృష్టం వరించినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటోన్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరో, అంటే శ్రీలీల హిందీలో బ్యాక్ టు బ్యాక్ కార్తీక్ ఆర్యన్ తో జత కట్టడం నిజంగా విశేషమే. ఫాంటసీ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా టాక్ వినబడుతుంది. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.





వరప్రసాద్ గారు దూకుడు ఆగట్లేదు 
Loading..