Advertisementt

4 డేస్ లో బ్రేక్ ఈవెన్ కొట్టిన రాజుగారు

Sun 18th Jan 2026 01:17 PM
anaganaga oka raju  4 డేస్ లో బ్రేక్ ఈవెన్ కొట్టిన రాజుగారు
Anaganaga Oka Raju Into Profits 4 డేస్ లో బ్రేక్ ఈవెన్ కొట్టిన రాజుగారు
Advertisement
Ads by CJ

ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా కనిపించిన నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఇప్పుడు పెద్ద హిట్ అయ్యి కూర్చుంది. జనవరి 14 న భోగి కి సినిమా ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచిన నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు మేకర్స్ ఇప్పుడు లాభాల బాట పట్టారు.

సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే అనగనగ ఒక రాజు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లుగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో కలెక్షన్స్ వేసి మరీ ప్రకటించారు. నవీన్ పోలిశెట్టి అద్భుతమైన ప్రమోషన్స్, అలాగే నవీన్ పోలిశెట్టి పెరఫార్మెన్స్ అన్ని సినిమాని విజయతీరానికి చేర్చాయి.

అనగనగ ఒకరాజుకి కామెడీ వర్కౌట్ అవడం, నవీన్ పోలిశెట్టి యూత్ ని అట్రాక్ట్ చేస్తూ చేసిన ప్రమోషన్స్ అన్ని సినిమాని హిట్ చేసాయి. గత బుధవారం విడుదలైన ఈ చిత్రం శనివారం గడిచేసరికి రూ.82 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్ తో ప్రకటించారు నిర్మాతలు. 

కుర్ర హీరో జోరుకి అన్ని ఏరియాల్లో అనగనగ ఒకరాజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి మరీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే దిశగా పరుగులు పెడుతుంది.

Anaganaga Oka Raju Into Profits :

Anaganaga Oka Raju Four Days Worldwide Boxoffice Office Collection

Tags:   ANAGANAGA OKA RAJU
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ