Advertisementt

వరప్రసాద్ గారు దూకుడు ఆగట్లేదు

Sun 18th Jan 2026 11:31 AM
chiranjeevi  వరప్రసాద్ గారు దూకుడు ఆగట్లేదు
Mana Shankara Vara Prasad Garu break even completed వరప్రసాద్ గారు దూకుడు ఆగట్లేదు
Advertisement
Ads by CJ

మన శంకర వరప్రసాద్ గారు దూకుడు ఆగట్లేదు. గత సోమవారం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి ల మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మొదట వారం పూర్తి కాకుండానే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

చిరంజీవి, వెంకటేష్, నయనతార, అనిల్ రావిపూడి  తమవంతు సినిమా విజయంలో పాలు పంచుకున్నారు. వరప్రసాద్ లో క్రింజ్ కామెడీ అంటున్నా సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయినా సినిమా కావడం మేకర్స్ కి కలిసొచ్చింది. దానితో ఈ చిత్రం ఇప్పటికే 250 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది.

ఇప్పుడు ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టింది. ఇకపై వచ్చే ప్రతి పైసా నిర్మాతలకు లాభాలే. మన శంకర వరప్రసాద్ గారు తో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీ. మెగాస్టార్ అయితే మరింత హ్యాపీగా మన శంకర వరప్రసాద్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. 

Mana Shankara Vara Prasad Garu break even completed :

Mana Shankara Vara Prasad Garu break even completed in just 6 days

Tags:   CHIRANJEEVI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ