ప్లాపుల్లో ఉన్నాడని శర్వానంద్ పక్కన నటించేందుకు ఏ హీరోయిన్ నటించనందా, అందుకే నారి నారి నడుమ మురారి దర్శకుడు రామ్ అబ్బరాజు తన హీరో శర్వానంద్ కోసం సెకండ్ హీరోయిన్ గా సంయుక్త ని సెలెక్ట్ చేసాడు అంటూ నారి నారి నడుమ మురారి సినిమా చూసిన వాళ్ళు మాట్లాడుతున్న మాట.
సంయుక్త మీనన్ బాలేదని కాదు, ఆమెకు నటన రాదు అని కాదు కానీ ఆమె స్ట్రెక్చర్ శర్వానంద్ పక్కన మ్యాచ్ కాలేదు, శర్వానంద్ అద్దరగొట్టేసాడు, కానీ ఆయన పక్కన సంయుక్త మీనన్ బబ్లీగా కనిపించింది. వారిరువురి సన్నివేశాల్లో ఆమె శర్వానంద్ కి అక్కలా కనిపించింది తప్ప రొమాన్స్ చేసే హీరోయిన్ లా లేదు అంటున్నారు.
నిజంగానే రామ్ అబ్బరాజు ఒక హీరోయిన్ గా సాక్షి వైద్య ని సెలెక్ట్ చేసారు, అక్కడి వరకు ఓకే కానీ సంయుక్త ప్లేస్ లో మరో నాజూకైన అమ్మాయిని పెట్టి ఉంటే బావుండేది అంటున్నారు, సినిమాలో కామెడీ సూపర్ గా వర్కౌట్ అయినా.. నారి నారి నడుమ మురారి టైటిల్ కి సార్ధకత చేసేంత బలమైన సన్నివేశాలు సినిమాలో లేకపోవడమే ఈ సినిమాకి మైనస్ అంటున్నారు.
కానీ కామెడీ పరంగా సినిమా ఈ సంక్రాంతి సీజన్ లో వర్కౌట్ అవుతుంది అనేది ప్రేక్షకుల మాట.





మాటలతో మ్యాజిక్ చేస్తోన్న హీరో 
Loading..