అవును కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి నిజంగా మాటలతో మ్యాజిక్ చేస్తున్నాడు. చేసింది నాలుగు సినిమాలే. కానీ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తే ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనేది ఈ హీరోని చూసి నేర్చుకోవాల్సిందే. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల్లో కామెడీ టైమింగ్ తో అద్దరగొట్టిన నవీన్ పోలిశెట్టి ఈ సంక్రాంతికి మొదటిసారి బాక్సాఫీసు దగ్గర సందడి చేసాడు.
అనగనగా ఒకరాజు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. చిన్న సినిమా, చిన్న హీరో అనే ఫీల్ రాకుండా నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు ని ప్రమోట్ చేసిన విధానానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా విడుదలకు ముందు ఒంటి చేత్తో ప్రమోషన్స్ చెయ్యడం, సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించడమే కాదు తన మాటలతో గారడీ చేస్తూ ఆడియన్స్ లో ఊపు తెస్తున్నాడు.
మిగతా సంక్రాంతి సినిమాలు హిట్ అయినా తన సినిమాని ఎక్కడా తక్కువ కాకుండా హిట్టు కొట్టా, కామెడీ ని ఎంజాయ్ చెయ్యండి అంటూ తన స్టయిల్లో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. సంక్రాంతి కి వచ్చిన సినిమాలు హిట్ అవడంతో తన సినిమాని ప్రేక్షకులు ఎక్కడ లైట్ తీసుకుంటారో అని నవీన్ పోలిశెట్టి ప్లానింగ్ ప్రకారం చేసిన ప్రమోషన్స్ కి అనగనగ ఒకరాజు థియేటర్స్ కి యూత్ క్యూ కడుతున్నారు.





యంగ్ హీరోస్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చిన సంక్రాంతి 
Loading..