కోలీవుడ్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య కు విడాకులిచ్చాక సింగిల్ గానే ఉంటున్నాడు. తన పేరెంట్స్, సిస్టర్స్ ఇలా ధనుష్ ఉన్నాడు. అయితే గత ఏడాది నుంచి ధనుష్ మృణాల్ తో స్నేహం చెయ్యడమే కాదు ఆమెతో డేటింగ్ లో ఉన్నాడనే టాక్ మాములుగా లేదు. కానీ మృణాల్ ఠాకూర్ మా మధ్యన స్నేహం తప్ప ధనుష్ తో మరో బంధం లేదు అంటుంది.
కానీ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఉంటారు, ధనుష్ తో ఆయన సిస్టర్స్ తో మృణాల్ క్లోజ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ధనుష్-మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వచ్చే నెల అంటే ఫిబ్రవరి 14 న ధనుష్-మృణాల్ ఠాకూర్ ల పెళ్లి జరగబోతుంది. అది కూడా ఫ్యామిలీ, అత్యంత క్లోజ్ పీపుల్ సమక్షంలో మృణాల్-ధనుష్ ల వివాహం జరగబోతుంది అనే వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ఈ వార్త లో ఎంత నిజం ఉంది అనేది ధనుష్ కానీ మృణాల్ కానీ రియాక్ట్ అయితేనే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త మాత్రం బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.




కొత్త లుక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్
Loading..